మహేశ్‌కుమార్‌గౌడ్, అద్దంకి దయాకర్‌పై హరీశ్‌రావు పరువునష్టం దావా విచారణ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌పై బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు వేసిన పరువునష్టం దావాను నాంపల్లిలోని ప్రతినిధుల కోర్టు విచారణకు స్వీకరించింది. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ, క్షుద్రపూజల పేరుతో తప్పుడు ప్రచారం చేశారని హరీశ్‌రావు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి, తదుపరి విచారణను వచ్చేనెల 8కి వాయిదా వేస్తూ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ల వాంగ్మూలం నమోదు చేయనున్నట్లు వెల్లడించారు.