ఆదోనిలో అరుదైన బట్టమేక పక్షుల సంచారంతో కళకళలాడుతున్న రోళ్లపాడు అభయారణ్యం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కర్నూలు
కర్నూలు జిల్లా ఆదోని పరిసర ప్రాంతాలలో అంతరించిపోతున్న అరుదైన రెండు బట్టమేక పక్షులు సంచరిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీంతో నందికొట్కూరు అటవీ డివిజన్ పరిధిలోని రోళ్లపాడు అభయారణ్యానికి పూర్వ వైభవం తెచ్చేందుకు అటవీ శాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి వాటి సంతతి పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది.