వైసీపీకి గట్టి షాక్.. పార్టీకి బొత్స మేనల్లుడు రాజీనామా!
రిపోర్టర్: BHAVANI THADI
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపినట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్గా కొనసాగుతుండటంతో ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.