అక్టోబరు ఒకటో తేదీ మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీకి మంత్రి ఆదేశాలు

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద అక్టోబరు ఒకటో తేదీ మధ్యాహ్నం నుంచి సామాజిక భద్రత పింఛన్లను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. అక్టోబరు నెల పింఛన్ల పంపిణీకి రెండు వేల ఆరు వందల తొంబై రెండు కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. బ్యాంకు సెలవులు మరియు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆయన స్పష్టం చేశారు.