పర్యావరణ హితం కోరుతూ భక్తులకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

పలాస నియోజకవర్గంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దువ్వాడ శ్రీధర్ బాబా ఆధ్వర్యంలో నేడు పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. శివాజీ నగర్లోని దువ్వాడ శ్రీధర్ బాబా నివాసంలో ఉదయం నుంచి భక్తులకు ఉచితంగా మట్టి విగ్రహాలను అందజేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని విగ్రహాలను స్వీకరించాలని నిర్వాహకులు కోరారు.