అహోబిలం పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం: ఆరు దుకాణాలు పూర్తిగా బూడిద
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Nandyal
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న బీగల ఆంజనేయస్వామి ఆలయ మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో సమీపంలోని దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనతో బాధితులు లబోదిబోమంటూ రోదిస్తున్నారు.