బిగ్ బాష్ లీగ్‌లో ప్రైవేట్ పెట్టుబడులకు ఆస్ట్రేలియా క్రికెట్ గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: సురేష్ స్థలం: Australia

ఆస్ట్రేలియా దేశీయ టీ20 టోర్నమెంట్ బిగ్ బాష్ లీగ్‌లో ప్రైవేట్ పెట్టుబడులకు క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతినిచ్చింది. 2027-28 సీజన్ నుంచి మెల్‌బోర్న్ రెనెగేడ్స్ ఫ్రాంచైజీని ప్రైవేట్ యాజమాన్యానికి విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియా క్రికెట్ ఆర్థిక స్థితిని బలపడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ మైక్ బైర్డ్ స్పష్టం చేశారు.