రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంపై విశాఖపట్నం జిల్లా ప్రథమ స్థానం
రిపోర్టర్: విజయ్
స్థలం: విశాఖపట్నం
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం పథకంపై మార్చి నెలలో విశాఖపట్నం జిల్లా 80.8 శాతం సంతృప్తితో మొదటి స్థానంలో నిలిచింది అని ప్రభుత్వం వెల్లడించింది. జనవరి నుంచి ఆగస్టు వరకు ఐవీఆర్ఎస్ ద్వారా సేకరించిన అభిప్రాయాల్లో విశాఖపట్నం సరాసరిన 77.8 శాతం స్కోరు సాధించింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం తర్వాతి స్థానాల్లో నిలవగా, తక్కువ స్కోరు నమోదైన జిల్లాల కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.