పబ్బు రాజు గౌడ్ మాతృమూర్తి మృతికి ఎమ్మెల్యే నివాళి

రిపోర్టర్: KOLA MAHESH స్థలం: నారాయణపురం

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడు పబ్బు రాజు గౌడ్ మాతృమూర్తి పబ్బు వజ్రమ్మ మృతి చెందారు. చౌటుప్పల్ మండలం మల్కాపూర్లోని పబ్బు రాజు నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే వజ్రమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.