రొమ్ము క్యాన్సర్పై అవగాహన: విశాఖలో విద్యార్థుల వినూత్న ఫ్లాష్మాబ్ ప్రదర్శన

రిపోర్టర్: అశోక్ స్థలం: విశాఖపట్నం

రొమ్ము క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విశాఖపట్నంలోని హెచ్సీజీ ఆసుపత్రి, ఎన్ఎస్ఆర్ఐటీ కళాశాల విద్యార్థులతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంలో భాగంగా సుమారు నలభై మంది విద్యార్థులు ఫ్లాష్మాబ్ ప్రదర్శన ద్వారా ఆరోగ్య సందేశం అందించారు. క్యాన్సర్పై అపోహలు తొలగించి మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని హెచ్సీజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్ ఐ.పీ. పేర్కొన్నారు. ముందస్తు గుర్తింపుతోనే మెరుగైన చికిత్స సాధ్యమని రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గుంటూరు ఇందిర వివరించారు.