విజయనగరం ఓక్ ల్యాండ్ స్కూల్లో ఘనంగా బ్లూ కలర్ డే వేడుకలు

రిపోర్టర్: BHAVANI THADI స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా జమ్ము ఓక్ ల్యాండ్ స్కూల్లో బ్లూ కలర్ డే వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నీలం రంగు దుస్తులు ధరించి సందడి చేశారు. వివిధ వినోదాత్మక కార్యక్రమాల ద్వారా నీలం రంగుపై అవగాహన కల్పించారు. చిన్నారులకు ఆచరణాత్మకమైన విద్యను అందిస్తున్నామని కరస్పాండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. డైరెక్టర్ చేపా రవి, ప్రిన్సిపాల్ సరిత మండల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.