మొయినాబాద్ లో ఈతవనం హక్కుల వివాదం: అధికారులను అడ్డుకున్న వైనం
రిపోర్టర్: అశోక్
స్థలం: రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అమ్డాపూర్ గ్రామంలో ఈతవనం హక్కులపై తీవ్ర వివాదం చెలరేగిందని అధికారులు తెలిపారు. ఏడేళ్లుగా చెట్లను పెంచిన వ్యక్తికి ప్రతిఫలం దక్కాలని కోరుతుండగా, సామూహిక హక్కులు ఉండాలని మరోవర్గం వాదిస్తోంది. పంచనామాకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిని అడ్డుకున్నారని, జర్నలిస్టులతోనూ కొందరు దురుసుగా ప్రవర్తించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు.