నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు: బరిలో నిలిచిన అభ్యర్థుల ప్రకటనపై ఈసీ తాజా బ్రేక్
రిపోర్టర్: రాము
స్థలం: Nellore
నెల్లూరు కార్పొరేషన్తో పాటు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసినప్పటికీ, బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితాను ఇప్పట్లో ప్రకటించవద్దని కలెక్టర్లకు ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో మేయర్ మరియు డివిజన్లవారీగా పోటీలో ఎంతమంది అభ్యర్థులు నిలిచారనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొన్ని డివిజన్లలో పోటీ ఏకపక్షంగా సాగుతుండగా, మరికొన్ని చోట్ల ద్విముఖ అలాగే ముక్కోణపు పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.