సముద్రతీరంలో భార్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న అల్లు అర్జున్
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
భార్య అల్లు స్నేహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా సముద్రతీరంలో దిగిన రొమాంటిక్ ఫోటోను టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సామాజిక మాధ్యమాలలో పంచుకున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ దిగిన ఈ ప్రత్యేక చిత్రానికి ఆయన హ్యాపీ బర్త్డే క్యూటీ అంటూ ఆప్యాయంగా క్యాప్షన్ జతచేశారు. ప్రస్తుతం ఈ వెకేషన్ ఫోటో నెట్టింట వైరల్గా మారడంతో అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.