నిరుద్యోగులకు గుడ్ న్యూస్: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష ఫలితాలు విడుదల

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల రాత పరీక్ష ఫలితాలను విడుదల చేశారని బోర్డు వర్గాలు వెల్లడించాయి. అధికారిక వెబ్సైట్లో ఫలితాలతో పాటు ఫైనల్ కీ, ఓఎంఆర్ షీట్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 17న సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.