మార్కెట్లోకి టాటా మోటార్స్ సియారా డార్క్ ఎడిషన్ విడుదల
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తన ఐకానిక్ ఎస్యూవీ సియారా కోసం ప్రత్యేకంగా డార్క్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ డార్క్ ఎడిషన్ బేస్ వేరియంట్ ప్యూర్ ఎల్ ట్రిమ్ నుంచి అందుబాటులో ఉండగా, దీని ప్రారంభ ధర రూ. 13.99 లక్షల నుంచి అత్యున్నత శ్రేణి అకంప్లిష్డ్ ప్లస్ ట్రిమ్‌కు రూ. 21.59 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంది. ఫ్రిసియన్ బ్లాక్ ఎక్స్టీరియర్ కలర్, ఆల్-బ్లాక్ ఇంటీరియర్ థీమ్ మరియు వైలెట్ మెటాలిక్ హైలైట్స్‌తో ఈ నూతన మోడల్ ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది.