అమెరికా వీసాలపై మార్పులు: హెచ్-వన్ బీ నిపుణులకు భారీ ఊరట

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

అమెరికాలో హెచ్-వన్ బీ వీసా నిబంధనలు మరియు లక్ష డాలర్ల ఫీజు విధింపుపై నెలకొన్న ఆందోళనల నడుమ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని విశ్లేషకులు తెలిపారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్ లో డెమోక్రాట్లు సెనేట్ తో పాటు ప్రతినిధుల సభను కూడా దక్కించుకోవడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలకు గట్టి అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఈ పరిణామాలు భారతీయ ఐటీ ఉద్యోగార్థులకు కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయని నిపుణులు స్పష్టం చేశారు.