ఆర్టీఐ దుర్వినియోగం: యాదాల భద్రయ్య దరఖాస్తులపై రాష్ట్ర సమాచార కమిషన్ నిషేధం
రిపోర్టర్: హరి
స్థలం: Palnadu
ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్న పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరుకు చెందిన కార్యకర్త యాదాల భద్రయ్యపై రాష్ట్ర సమాచార కమిషన్ తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఆయన ఇకపై ఆర్టీఐ కింద దరఖాస్తు చేయడానికి వీళ్లేదని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు సోమవారం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా ప్రయోజనాలు లేని వెయ్యికిపైగా దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఈ కీలక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.