పెదబయలులో కూటమి అభివృద్ధి ప్రచారం: అభ్యర్థులను గెలిపించాలని నాయకుల పిలుపు

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: పెదబయలు

పెదబయలు మండలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక ప్రజలకు నాయకులు వివరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ మరియు సర్పంచ్ పదవులకు పోటీ చేసే అభ్యర్థులకు మద్దతు తెలిపి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అడుగులాపుట్, వడ్డెకోడపుట్, అలమపుట్ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజా సంక్షేమ పథకాలను గుర్తుచేశారు.