ఓటీటీలోకి ఎంఎస్ రాజు అగధ సినిమా స్ట్రీమింగ్ తేదీ ఖరారు
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో ఎంఎస్ రాజు తెరకెక్కించిన సస్పెన్స్, డివైన్, మిస్టిక్ థ్రిల్లర్ చిత్రం అగధ ఆగస్ట్‌లో థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించగా, సెప్టెంబర్ 25 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో స్ట్రీమింగ్ కానుంది. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ చిత్రంలో శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.