యూపీఐ రుసుములు వద్దు: ఏఐవైఎఫ్
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం: యూపీఐ చెల్లింపులపై కొత్త వ్యాపారి రుసుముల భారం మోపొద్దని ఏఐవైఎఫ్ జిల్లా మాజీ కార్యదర్శి కొండపర్తి గోవిందరావు డిమాండ్ చేశారు. రుసుములు వెనక్కి తీసుకోకపోతే ప్రతిఘటిస్తామని జిల్లా అధ్యక్షుడు మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి, కార్యదర్శి చింతల రమేష్ హెచ్చరించారు. ఖమ్మం కొత్త బస్టాండ్లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.