సారపాకను స్వచ్ఛ పంచాయతీగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకను స్వచ్ఛ పంచాయతీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పంచాయతీ సర్పంచ్ గుగులోత్ కిశోర్‌నాయ‌క్ తెలిపారు. మంగళవారం గాంధీనగర్, సంత ఏరియాల్లో ఐటీసీ అడ్మిన్ మేనేజర్ చెంగల్‌రావుతో కలిసి ఆయన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛతపై అవగాహన కల్పించారు.