హైదరాబాద్ పరిధిలో 22ఏ భూముల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ పరిధిలో నిషిద్ధ జాబితా లేదా 22ఏ పరిధిలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ, డీటీసీపీ, హెచ్ఎండీఏ అనుమతులు ఉన్న నిర్దిష్ట భూములకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కొనసాగించేందుకు వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వేలాది మంది భూయజమానులు, కొనుగోలుదారులకు పెద్ద ఎత్తున ఊరట లభించనుంది. ఈ కొత్త ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.