మొగిలిశ్వర ఆలయ అభివృద్ధికి రెండు కోట్లు మంజూరు చేసిన ఎమ్మెల్యే
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: బంగారుపాళెం
చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం మొగిలిశ్వర దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున రెండు కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. చోళుల కాలం నాటి ఈ పుణ్యక్షేత్రాన్ని భక్తులకు అన్ని వసతులు కల్పించి మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.