ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం ఇద్దరు చిన్నారులు మృతి
రిపోర్టర్: శివ
స్థలం: ఆదిలాబాద్
ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్ ఆసుపత్రిలోని ఎస్ఎన్‌సీయూ వార్డులో అర్ధరాత్రి ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పసికందులు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలాన్ని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించగా, సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.