మొదటి ఐదేళ్ల పాటు కొడుకును గ్యాడ్జెట్లకు దూరంగా ఉంచిన అమృత రావు

రిపోర్టర్: సునీల్ స్థలం: ముంబై

తన కుమారుడు వీర్ మొదటి ఐదేళ్ల వయసు వచ్చే వరకు టీవీ మరియు మొబైల్ ఫోన్లకు పూర్తిగా దూరంగా ఉంచినట్లు ప్రముఖ బాలీవుడ్ నటి అమృత రావు వెల్లడించారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్ లో మాట్లాడిన ఆమె, మాతృత్వంలో ఇదే అత్యుత్తమ నిర్ణయమని పేర్కొన్నారు. పిల్లలకు ఎలాంటి స్క్రీన్ టైమ్ ఇవ్వకుండా పెంచడం వల్ల వారిలో మంచి మార్పులు వస్తాయని ఆమె స్పష్టం చేశారు.