'మూషక ఆన్ వీల్స్': నగరంలో వినూత్నంగా ఓన్లీ యాప్ ప్రచారం
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
వినాయక చవితి పండుగ సందర్భంగా ర్యాపిడో ఫుడ్ డెలివరీ యాప్ 'ఓన్లీ' సంస్థ వినూత్న రీతిలో 'మూషక ఆన్ వీల్స్: బాప్పాస్ డెలివరీ పార్టనర్' పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని హైదరాబాద్ నగరంలో ప్రారంభించింది. స్వామివారి వాహనమైన మూషకుడిని డెలివరీ పార్ట్‌నర్‌గా మలుస్తూ ఏర్పాటు చేసిన భారీ సైజు విగ్రహం కలిగిన బ్రాండెడ్ వ్యాన్ బాలాపూర్, సికింద్రాబాద్, హైటెక్ సిటీ, మాదాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను ఆకట్టుకుంటోంది.