గూఢచారి 2 విజువల్స్ చూసి ఆశ్చర్యపోయిన రాహుల్ రవీంద్రన్

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

అడివి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా స్పై థ్రిల్లర్ ‘గూఢచారి 2’ (G2)పై దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ప్రశంసలు కురిపించారు. సినిమా రఫ్ ఎడిట్ చూసిన ఆయన, విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, ట్విస్టులు అద్భుతంగా ఉన్నాయని, భారతీయ స్పై థ్రిల్లర్ ప్రమాణాలను ఈ చిత్రం మరో స్థాయికి తీసుకెళ్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ కీలక దశలో కొనసాగుతోంది.