ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
రిపోర్టర్: రాజేష్
స్థలం: India
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఆర్ఆర్బీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. లెవెల్-2, లెవెల్-3 విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి అక్టోబర్ 15 నుంచి నవంబర్ 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ అర్హత కలిగిన 18 నుండి 30 సంవత్సరాల వయసున్న అభ్యర్థులు అర్హులు. రాత పరీక్షలు, కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది.