ఇన్స్టా టాటూ ఆధారంగా వీడిన మహిళ మృతదేహ మిస్టరీ
రిపోర్టర్: విజయ్
స్థలం: ఇబ్రహీంపట్నం
మహిళను అతి కిరాతకంగా హత్య చేసి శరీరాన్ని పది ముక్కలుగా నరికిన దారుణ ఘటనపై ఎన్టీపీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా మృతురాలను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కల్యాణి అలియాస్ దుర్గగా గుర్తించినట్లు ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. మంగళగిరిలో నివసిస్తున్న ఆమె ఈ నెల 17న హత్యకు గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, ఆర్థిక పరమైన కారణాలు లేదా వివాహేతర సంబంధాల కోణంలో విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.