ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై కేసీఆర్ కూతురు కవిత ఫైర్
రిపోర్టర్: సునీల్
స్థలం: ఆదిలాబాద్
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన చిన్నారుల మృతి ఘటనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైద్యుల నిర్లక్ష్యం కంటే మంత్రి తీరే అత్యంత బాధాకరమన్నారు. ముగ్గురు చిన్నారులు మరణిస్తే కనీసం ఆర్థిక సాయం అందించలేదని, కేవలం ఫోటోల కోసం మాత్రమే మంత్రి అక్కడ పర్యటించారని ఆరోపించారు. ప్రభుత్వంలో కనీస మానవత్వం కొరవడిందని ఘాటు విమర్శలు గుప్పించారు.