నాగినా చిత్రంలో శ్రీదేవి లుక్ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్
రిపోర్టర్: మహేష్
స్థలం: ముంబై
దివంగత నటి శ్రీదేవి ఐకానిక్ చిత్రం నాగినాలోని గెటప్ను ఆమె కూతురు, ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ అచ్చం అలాగే ధరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు హలోవీన్ వేడుకల సందర్భంగా తల్లి పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తూ జాన్వీ ప్రత్యేకంగా ఈ రూపును ఎంచుకున్నట్లు ఫ్యాషన్ నిపుణులు వెల్లడించారు. తెలుపు రంగు లెహంగా, సాంప్రదాయ ఆభరణాలతో ఆమె సరిగ్గా అప్పట్ లోని శ్రీదేవిలాగే కనిపించారంటూ సోషల్ మీడియాలో భారీగా ప్రశంసలు వస్తున్నాయి.