టీమ్ ఇండియాలో నితీశ్ కుమార్ రెడ్డి అంచనాలకు మించి రాణించడంపై మోర్కెల్ ప్రశంసలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: New Delhi

న్యూజిలాండ్ పర్యటనలో ఆల్ రౌండర్ గా సత్తా చాటుతున్న నితీశ్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో హార్దిక్ పాండ్యా కు తగిన ప్రత్యామ్నాయంగా ఎదుగుతాడని భారత బౌలింగ్ కోచ్ మోర్కెల్ పేర్కొన్నారు. మైదానంలో నితీశ్ పడుతున్న కఠిన శ్రమ జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా మారుతోందని, అన్ని ఫార్మాట్లలో ఆడే సత్తా అతనికి ఉందని మోర్కెల్ వెల్లడించారు.