పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ పిలుపు

రిపోర్టర్: రాజేష్ స్థలం: హన్మకొండ

రోడ్డు ప్రమాద బాధితులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు ఎలాంటి ఆలస్యం లేకుండా సకాలంలో ప్రాణాలను రక్షించే అత్యవసర వైద్య చికిత్స అందించేందుకు ఈ ప్రత్యేక పథకం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మెరుగైన వైద్యం పొందాలని స్పష్టం చేశారు.