కృష్ణపట్నంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా నిర్వహణ

రిపోర్టర్: రాజేష్ స్థలం: కృష్ణపట్నం, ముత్తుకూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో అట్టహాసంగా సాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్ల కాలంలో కేవలం ఈ పంచాయతీ పరిధిలోనే అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. స్థానిక ప్రజల అవసరాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సీఎస్ఆర్ నిధుల కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని వెల్లడించారు.