వెల్దుర్తిలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలని వినతి
రిపోర్టర్: హరి
స్థలం: వెల్దుర్తి
వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని వార్డులలో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సీసీఐ నాయకులు పంచాయతీ అభివృద్ధి అధికారి రహమత్ బాషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దోమల కారణంగా ప్రజలు వివిధ వ్యాధులకు గురవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పారిశుద్ధ్య పనులు నిర్వహించడంతో పాటు ఫాగింగ్ చేపట్టి దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని వారు గట్టిగా కోరారు.