నాతవరంలో ఘనంగా వైయస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నాథవరం
అనకాపల్లి జిల్లా నాథవరం మండలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. నర్సీపట్నం మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమా శంకర గణేష్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ క్యాడర్‌కు నూతన ఐడీ కార్డులను ఘనంగా పంపిణీ చేశారు. ఈ సమావేశంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.