బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు పార్టీ అధిష్టానం త్రీ-లైన్ విప్ జారీ
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
తెలంగాణ శాసనసభ సమావేశాల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. పార్టీ ఎమ్మెల్సీలందరూ విధిగా సభా సమావేశాలకు హాజరుకావాలని స్పష్టం చేస్తూ త్రీ-లైన్ విప్ జారీ చేసింది. కీలక చర్చలు, బిల్లులు మరియు ఓటింగ్ సమయంలో సభ్యులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించింది. విప్‌ను ధిక్కరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అనర్హత వేటు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.