జూరాల సందర్శనకు బయలుదేరిన బీజేపీ చీఫ్ రామచంద్రరావు అరెస్ట్
రిపోర్టర్: మహేష్
స్థలం: మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ జిల్లా జూరాల సందర్శనకు బయలుదేరిన బీజేపీ నేత రామచంద్రరావును జడ్చర్ల సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు. జూరాల నీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకుని 44వ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ అరెస్టుల్లో పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.