భూగర్భ జలాల పరిరక్షణకు కఠిన నిబంధనలు: కొత్త బోర్ల తవ్వకాలపై ప్రభుత్వం స్పష్టత
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తెలంగాణ
భూగర్భ జలాల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ఎల్నీనో పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలు మినహా ఇతర పనులకు శుద్ధి చేసిన మురుగు నీటిని మాత్రమే వాడాలని జీవో 259 ద్వారా స్పష్టం చేశారు. అనుమతులు లేని బోర్ల తవ్వకంపై వాల్టా చట్టం కింద కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.