బెదిరింపుల కారణంగా యూపీలో స్టాండప్ కమిడియన్ పుల్కిత్ మని షోలు రద్దు
రిపోర్టర్: విజయ్
స్థలం: ఇండోర్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో కలిసి ప్రధాని మోదీపై సెటైర్లు వేసిన స్టాండప్ కమిడియన్ పుల్కిత్ మని యూపీలో తన షోలను రద్దు చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఛాట్రోన్ కీ గూంజ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఆ తర్వాత బెదిరింపులు రావడంతో నోయిడా, లక్నో, కాన్పూర్ షోలను రద్దు చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. బీజేపీ నేతల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.