మంథని మండలం బిట్టుపల్లిలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రారంభం
రిపోర్టర్: Subhan.Manthani
స్థలం: మంథని
పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టుపల్లి గ్రామంలో జాతీయ గణాంక శాఖ ఆధ్వర్యంలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రారంభమైంది. జాతీయ గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఈ సర్వే జరుగుతోంది. ఈ సందర్భంగా మంథని ఆర్డీవో సురేష్, తహశీల్దార్ ఆరిఫొద్దీన్, ఎంపీడీవో కంకణాల శ్రీజ రెడ్డిలను అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి కరపత్రాలు అందజేశారు. దేశంలో ఉపాధి, నిరుద్యోగంపై కచ్చితమైన సమాచారం సేకరించడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు.