టెక్ ప్రియులకు గుడ్ న్యూస్: మార్కెట్లోకి రెడ్ మీ నూతన స్మార్ట్ ఫోన్

రిపోర్టర్: సతీష్ స్థలం: New Delhi

దేశీయ మార్కెట్లో ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్ మీ నుంచి నూతనంగా విడుదలైన రెడ్ మీ 17సి 5జి సేల్స్ ప్రారంభమైనట్లు జియోమీ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ సరికొత్త మొబైల్ ఆకర్షణీయమైన ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్తో పాటు అధునాతన కెమెరా అమరికను కలిగి ఉందని టెక్ నిపుణులు పేర్కొన్నారు. వినియోగదారుల బడ్జెట్కు అనుగుణంగా వివిధ వేరియంట్లలో లభిస్తున్న ఈ హ్యాండ్సెట్ కొనుగోలుపై ఆన్లైన్ ఈ-కామర్స్ వేదికలలో ప్రత్యేకమైన ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నట్లు సమాచారం.