జటంగిబావిలో రోడ్లపాలవుతున్న తాగునీటిని చూసి తీవ్ర ఆవేదన చెందుతున్న జనం

రిపోర్టర్: Srinivasulu akavaram స్థలం: మోత్కూరు

ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని జటంగిబావి గ్రామంలో తాగునీరు వీధుల వెంట వృథాగా పారుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ట్యాంకులు నిండిన తర్వాత కూడా నీటి సరఫరాను నియంత్రించకపోవడం వల్ల చివరి ఇళ్లకు నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.