రేషన్ కార్డుదారులకు భారీ ఊరట: సరుకులు నిలిపివేతపై పౌరసరఫరాల శాఖ స్పష్టత

రిపోర్టర్: గోపి స్థలం: ఆంధ్రప్రదేశ్

రేషన్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ కాలేదనే కారణంతో సరుకులు నిలిపివేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని పౌరసరఫరాల శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సోమవారం స్పష్టతనిచ్చిన అధికారులు, ఈకేవైసీ లేదా మొబైల్ నంబర్ అనుసంధానం కాకపోతే రేషన్ ఆపేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదని తేల్చి చెప్పారు. సరుకులు ఇవ్వడానికి డీలర్లు నిరాకరిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కార్డుదారులకు అధికారులు సూచించారు.