హయత్నగర్లో దొంగల బీభత్సం: గేటెడ్ కమ్యూనిటీలో రెండు ఇళ్ల తాళాలు ధ్వంసం

రిపోర్టర్: సురేష్ స్థలం: హయత్‌నగర్

హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజయ్ గుల్మోహర్ గేటెడ్ కమ్యూనిటీలో దుండగులు రెండు ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు డీఐ సంతోష్ కుమార్ వెల్లడించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి సయ్యద్ మోసిన్ హుస్సేన్, రిటైర్డ్ ఉద్యోగి సంజీవరావు ఇళ్లలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఊళ్లకు వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగినట్లు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి, బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.