ఎడతెరిపిలేని వర్షాలతో ఎల్నినో ప్రభావం తొలగి అన్నదాతలకు భారీ ఊరట
రిపోర్టర్: హరి
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
ఎన్టీఆర్ జిల్లాలోని అమరావతి, విజయవాడ, నందిగామ, తిరువూరు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో సాగు నీటి కోసం అల్లాడిన అన్నదాతలకు ఈ వర్షాలు ఎంతో ఊరటనిచ్చాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో జలాశయాలు నిండుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాల ప్రజలకు తగిన సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.