ఆదోని మున్సిపల్ ఎన్నికలు: టీడీపీ, వైసీపీకి షాకిచ్చి జనసేన రెబల్ గెలుపు
రిపోర్టర్: మహేష్
స్థలం: కర్నూలు
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ ఎన్నికల్ లో ప్రధాన పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని స్థానిక అధికారులు తెలిపారు. కూటమి పొత్తులో టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన జనసేన రెబల్ అభ్యర్థి స్వప్న నాయకర్ సుమారు నాలుగు వేల ఓట్ల భారీ మెజారిటీతో సంచలన విజయం సాధించారు. ఈ ఊహించని పరిణామాంతో టీడీపీ, వైసీపీ అంచనాలు తలకిందులయ్యాయని, నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు రాజకీయ వర్గాల్ లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోందని విశ్లేషకులు వెల్లడించారు.