మత్స్యపురంలో రోడ్డు కొట్టుకుపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న వైఎస్సార్సీపీ
రిపోర్టర్: రాజేష్
స్థలం: Alluri Sitarama Raju District
అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం బట్టబయలైందని వైఎస్సార్సీపీ ఆరోపించింది. మత్స్యపురంలో డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోవడంతో పాడేరు-జి.మాడుగుల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని పార్టీ పేర్కొంది. కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే నాణ్యత లేని రోడ్లు వేయిస్తున్నారని, అందుకే వరదలకు కొట్టుకుపోతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను వైఎస్సార్సీపీ తీవ్రంగా విమర్శించింది.