మేక్ ఇన్ ఇండియా లక్ష్యంగా మొబైల్ తయారీలో మరో అడుగు

రిపోర్టర్: విజయ్ స్థలం: New Delhi

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత్ ఇక కేవలం మొబైల్ ఫోన్ల అసెంబ్లింగ్కే పరిమితం కాకుండా విడిభాగాల తయారీ దిశగా అడుగులు వేస్తోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. దేశంలోనే బ్యాటరీ సెల్స్, సింథటిక్ గ్రాఫైట్, ఎలక్ట్రోలైట్ అన్వాకాలను తయారు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గత పదేళ్లలో దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, ఏటా కోట్లాది ఫోన్లు తయారవుతున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు.